ప్రేమ వెన్నెల (Prema Vennela)

                                                            ప్రేమ వెన్నెల



రంగు రంగు పువ్వులున్న అందమైన తోటలో
 ఇప్పుడే పూసినా కొత్త పువ్వులా 
ఏడురంగులొక్కటై పరవసించు వేళలో
నెలకే జారినా కొత్త రంగులా
వానలా వీణలా వానవీణవాణిలా 
గుండెలో పొంగినా కృష్ణవేణిలా
ఒంటరీ మనసులో ఒంపి వెయ్యకే అలా
సరిగమల్ని తీయగా ఇలా......

ప్రేమ వెన్నెలా..... రావే ఊర్మిళా...
ప్రేమ వెన్నెలా..... రావే ఊర్మిళా... అహో....

దిద్దితే నువ్వులా కాటుకే కన్నుల
మారదా పగలిలా అర్ధరాత్రిలా
నవ్వితే నువ్వలా మెల్లగా మిళమీళా
కలవరం గుండెలో కలతపూతలా
రాయలోరి నగలలోంచి మాయమైన మణులిలా
మారిపోయేనేమో నీ రెండు కళ్ళలా
నిక్కమైన నీలమొకటి చాలు అంటు వేమన
నిన్ను చూసె రాసినాడెలా.........

ప్రేమ వెన్నెలా..... రావే ఊర్మిళా...

నడవకే నువ్వలా కాలలలో కోమలా.......

నడవకే నువ్వలా కలలలో కోమల
పాదమే కందితే మనసు విలవిల
విడువకే నువ్వలా పలుకులే గలగల
పెదవులే అదిరితే గుండె గిలగిల
అంతులేని అంతరిక్షమంతుచూడకే అలా
నీలమంత దాచిపెట్టి వాలుకన్నులా...
ఒక్కసారి గుండెలోకి అడుగుపెట్టి రా ఇలా
ప్రాణమంత పొంగిపోయేలా.......


ప్రేమ వెన్నెలా..... రావే ఊర్మిళా...

Comments

Popular posts from this blog

ఒంటి తల రావణా (Onti thala raavana)